- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని అలాంటి రోల్ చేయనున్నాడా..!
నేచురల్ స్టార్ నాని(Nani)బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani)బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల శ్యామ్‌సింగరాయ్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) వంటి సినిమాలతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్(The Paradise), హిట్-3 వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ‘ది ప్యారడైజ్’పై సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతుండటంతో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఇటీవల విడుదలైన గ్లింప్స్.
ఇందులో నాని రెండు జడలతో ఊరమాస్ లుక్‌లో కనిపించడంతో అంతా చర్చించుకోవడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ట్రాన్స్ జెండర్‌గా కనిపించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా అమ్మాయిగా నటించిన విషయం తెలిసిందే. ‘లైలా’ మూవీలో నటించినప్పటికీ హిట్ అందుకోలేక పోయాడు. రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటించగా.. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అయితే ఈ మూవీ బారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న వచ్చి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
READ MORE ...
గ్లోబల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న నాగార్జున బ్యూటీ.. వీరిద్దరి జంట సూపర్ అంటున్న ఫ్యాన్స్






