- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్‌లాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. మరోసారి వాయిదా పడిన ‘వృషభ’ సినిమా..
వరుస హిట్లు సాధిస్తూ, కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోహన్‌లాల్ (Mohanlal)బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టిస్తున్నారు.

దిశ, సినిమా: వరుస హిట్లు సాధిస్తూ, కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోహన్‌లాల్ (Mohanlal)బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వృషభ’ (Vrusshabha)ఒకటి. ఇది తండ్రీ, కొడుకల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని తరాల గురించి చెప్పబడే ఒక భావోద్వేగ కథను మూవీగా చూపించనున్నారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నంద కిషోర్ (Nanda Kishore)తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 200 కోట్లతో AVS స్టూడియోస్, కనెక్ట్ మీడియా సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
చిత్రం ఏక్తా కపూర్ నిర్మించబోయే తొలి పాన్ ఇండియన్ మూవీగా నిలువబోతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వస్తుంది. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. నవంబర్ 6నకు వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా.. పలు కారణాల వల్ల రిలీజ్ కాలేదు. దీంతో తీవ్ర అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తాజాగా, మోహన్ లాల్ ‘వృషభ’ మూడోసారి వాయిదా పడినట్లు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. భావోద్వేగం, గొప్పతనం, విధిని జరుపుకునే చిత్రం.
రాజు రాక రాజరికం లాంటిది. 2025 డిసెంబర్ 25న ‘వృషభ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడైనా విడుదల చేస్తారా? లేక వచ్చే ఏడాదివి వాయిదా వేస్తారా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో సమర్జిత్ లంకేష్, రాగిణీ ద్వివేది, నయన్ సారిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా అఖండ-2, బైకర్, డెకాయిట్, మోగ్లీ, శంబాల, చాంపియన్ వంటి చిత్రాలకు పోటీగా రాబోతుంది.






