జాన్వీ కపూర్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. వైరల్‌గా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

జాన్వీ కపూర్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక తెలుగులో మొట్టమొదటి సినిమానే ఎన్టీఆర్ ‘దేవర’ (devara)లో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సరసన నటిస్తోంది. బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుండగా.. ఇందులో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీతో పాటు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ‘పరమ్ సుందరి’ కూడా చేస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా నటిస్తుండగా.. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రాబోతుండగా.. దీనిని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, అక్షయ్ ఖన్నా, అకాశ్ దహియా కీలక పాత్రలో నటిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ జూలై 25న విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘పరమ్ సుందరి’(Param Sundari) మూవీ వాయిదా పడినట్లు పలు వార్తలు వస్తున్నాయి. పలు కారణాల వల్ల జూలై 25న విడుదల కావాల్సి సినిమా ఆగస్టు 29న రాబోతున్నట్లు టాక్. ఈ వారంలో టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన జాన్వీ కపూర్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

link

Next Story