త్రివిక్రమ్ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Disha Web Desk 7 |
త్రివిక్రమ్ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ మొదట్లో సినీ రచయితగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు దర్శకుడుగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. కాగా నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులంతా వారి వారి స్టైల్‌లో సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ మంచి ఆప్తమిత్రుడనే సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు పవన్ ఊహించని కానుక ఇచ్చాడని తెలుస్తుంది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సుమారు రూ. 6 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని త్రివిక్రమ్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం అంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరమేంటి? రోడ్ల మీద తిండి లేని వారికి, నిరాశ్రయులకు సహాయం చేయొచ్చు కదా అంటున్నారు.

Next Story