- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘సలార్’ చూసేందుకు వారికి నో ఎంట్రీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’. దీనిని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’. దీనిని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్‌లో విడుదలైంది. దీనిని చూసేందుకు జనాలు భారీగా థియేటర్స్ ముందు క్యూ కడుతున్నారు. తాజాగా, గుంటూరు నాజ్ సెంటర్‌లోని పీవీఆర్ థియేటర్స్ యాజమాన్యం ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. 18 ఏళ్లు నిండని వారిని లోపలికి అనుమతించకుండా థియేటర్ బయటకు పంపేశారు. దీంతో వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు థియేటర్ యాజమాన్యంకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వాళ్ళు వచ్చి వారిని అదుపు చేశారు. వారం రోజుల్లో రీఫండ్ చేస్తామని యాజమాన్యం తెలపడంతో ప్రభాస్ అభిమానులు కూల్ అయ్యారు. దీనికి కారణం సలార్‌కు ఏ సర్టీఫికెట్ వచ్చినందున 18 ఏళ్లు నిండని వారిని లోపలికి అనుమతించలేదని సమాచారం.
Read More..
ఇండియన్ బాక్సాఫీస్‌ను చీల్చిచెండాడుతోన్న ప్రభాస్.. రెండ్రోజుల్లో ఎంతంటే?






