చిరంజీవికి షాక్.. భోళా శంకర్‌కు హ్యాండిచ్చిన మిల్కీ బ్యూటీ

by Disha Web Desk 7 |
చిరంజీవికి షాక్.. భోళా శంకర్‌కు హ్యాండిచ్చిన మిల్కీ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి హీరోగా, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా నటిస్తుంది. అయితే హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ నుంచి తమన్నా తప్పుకున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో జోరందుకున్నాయి. తమన్న పాత్ర కంటే కీర్తి సురేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నప్పటికీ మూవీ ఒప్పుకున్న మిల్క్ బ్యూటీకి మేకర్స్ మరో షాక్ ఇచ్చారట.

అయితే తనకు తెలియకుండా తమన్న చేసే కొన్ని సీన్స్ స్క్రిఫ్ట్ నుంచి తొలగించారట. దీంతో తమన్న పాత్ర ప్రాధాన్యతో పాటు రన్ టైం కూడా తగ్గిపోవడంతో అసహనం వ్యక్తం చేసిన బ్యూటీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కాగా.. మేకర్స్ సైతం ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాకు బదులు వేరే హీరోయిన్ తీసుకునే పనిలో పడ్డారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Actress Divya Bharathi: మత్తెక్కిస్తున్న దివ్య భారతి గ్లామర్ ఫోటోలు వైరల్..!

Next Story