- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రవర్సీ మూవీపై అక్కినేని కోడలు పోస్ట్.. అస్సలు మిస్ అవ్వొద్దంటూ కీలక విజ్ఞప్తి
బ్యాడ్ గర్ల్ సినిమాను చూసిన శోభిత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ కీలక విజ్ఞప్తి చేసింది. ‘‘బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది.. ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ తప్పకుండా చూడాల్సి చిత్రం ఇది. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనకోసం తీసిన వర్ష భరత్, అంజలి శివరామన్‌ని అభినందిచాలి’’ అని రాసుకొచ్చింది.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో అంతగా మెప్పించనప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటాయి ఇక ఇటీవల ఓ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి వచ్చి సినీ సెలబ్రిటీలు చేత ప్రశంసలు పొందుతోంది. ఈ విషయంపై అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) కూడా ఓ పోస్ట్ పెట్టింది.
అసలు విషయంలో వెళితే.. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘బ్యాడ్ గర్ల్’(Bad girl). ఈ చిత్రంతో వర్ష భరత్ కుమార్ (Varsha Bharat Kumar)దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా సమాజంలోని కట్టుబాట్ల మధ్య తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకునే ఒక మధ్యతరగతి యువతి కథగా తెరకెక్కించారు. చిత్రీకరణ సమయంలోనే వివాదాస్పదంగా మారింది. టీజర్‌లో బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు చేయడంతో సెన్సార్ బోర్డు విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అన్ని కాంట్రవర్సీలను దాటుకుని ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ‘బ్యాడ్ గర్ల్’ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాను చూసిన శోభిత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ కీలక విజ్ఞప్తి చేసింది. ‘‘బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది.. ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ తప్పకుండా చూడాల్సి చిత్రం ఇది. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనకోసం తీసిన వర్ష భరత్, అంజలి శివరామన్‌ని అభినందిచాలి’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెటిజన్లు కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నీకు కనిపించలేదా.. ఎందుకు రెస్పాండ్ కాలేదని ప్రశ్నిస్తున్నారు.






