రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా..

by Chukka Sudharani |

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చినప్పటి నుంచి చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా సరే విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చినప్పటి నుంచి చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా సరే విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే నెల రోజుల తర్వాత.. ప్లాప్ అయితే రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన తాజా సినిమా ‘ఘోస్ట్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 19న కన్నడలో రిలీజ్ కాగా.. నవంబర్ 4న తెలుగులో విడుదలైంది. అయితే.. ఊహించిన రీతిలో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతో తెలుగులో రిలీజై ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా తెలియలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఘోస్ట్’ సినిమా నవంబర్ 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక థియేటర్‌లో ఈ సినిమా మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఎంజాయ్ చేయండి.

Next Story