సినిమా చరిత్రలోనే తొలిసారి.. భారీ హైప్ క్రియేట్ చేసిన‘45’ట్రైలర్‌ అప్డేట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-05 15:26:22  IST  )

శివరాజ్ కుమార్(Shivaraj Kumar), ఉపేంద్ర(Upendra), రాజ్ బి శెట్టి(Raj B Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘45’.

సినిమా చరిత్రలోనే తొలిసారి.. భారీ హైప్ క్రియేట్ చేసిన‘45’ట్రైలర్‌ అప్డేట్
X

దిశ, సినిమా: శివరాజ్ కుమార్(Shivaraj Kumar), ఉపేంద్ర(Upendra), రాజ్ బి శెట్టి(Raj B Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘45’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ‘45’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ కంటెంట్ పెంచుకునేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘45’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రాబోతున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 15న ట్రైలర్ రాబోతుండగా.. ఏకంగా 7 జిల్లాల్లో 7 ఈవెంట్స్ నిర్వహించి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇలా చేయడం సినిమా చరిత్రలోనే తొలిసారి అని టాక్. మొత్తానికి శివరాజ్ కుమార్ ‘45’ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడని చెప్పాలి. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో ఈ ట్రైలర్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది.

Next Story