ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకున్న స్టార్ హీరో.. మన:శాంతి కోసం..

by Disha Web Desk 23 |
ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకున్న స్టార్ హీరో.. మన:శాంతి కోసం..
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ మధ్య ‘ప్రిన్స్’ అనే స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చేసిన ఆయన.. తాజాగా ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. జాగ్రత్త. త్వరగానే వచ్చేస్తా. ఫిల్మ్ అప్‌డేట్స్ గురించి నా టీమ్ షేర్ చేస్తుంది’ అని పోస్ట్ పెట్టాడు. కాగా ‘నిన్ను మిస్ అవుతాం. మరింత పవర్‌తో తిరిగి వచ్చేయ్’ అని కామెంట్ చేస్తున్నారు అభిమానులు.


Next Story