శివాజీ కరెక్ట్ చెప్పారు.. అనసూయ, చిన్మయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ నటి సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ మధ్య కాలంలో సినీ నటులు పలు సినిమా ఈవెంట్‌లో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.

శివాజీ కరెక్ట్ చెప్పారు.. అనసూయ, చిన్మయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినీ నటులు పలు సినిమా ఈవెంట్‌లో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. కొందరు ఆవేశంలో చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్లీ నెగిటివిటీ రావడంతో తగ్గి క్షమాపణలు చెప్తున్నారు. ఇక ఇటీవల శివాజీ(Shivaji) ‘దండోరా’ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు డ్రెస్సింగ్‌పై, సామాన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనపై నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు అనసూయ, చిన్మయి, మంచు మనోజ్ వంటి వారు విరుచుకుపడుతున్నారు. ఆయనను తిడుతూ.. పలు పోస్టులు పెడుతున్నారు. కొద్ది గంటల్లోనే శివాజీకి నెగిటివిటీ ఊహించని స్థాయిలో పెరిగింది.

ఈసమయంలోనే ఆయన స్పందించి క్షమాపణలు చెప్పారు. అయితే అందరూ శివాజీ తీరును తప్పుపడుతుండటం గమనార్హం. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani)షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరూ వ్యతిరేకిస్తునకన శివాజీకి మద్దతు తెలిపుతూ అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘శివాజీ చేసిన వ్యాఖ్యలు కరెక్టే. ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట భారతదేశ స్త్రీలను చేతులెత్తి గౌరవించే సంస్కారం ఉంది. భారతదేశం అంటే అందరికీ ఓ గౌరవం. చికిరి చికిరి పాటలోనూ కొన్ని బూతు పదాలున్నాయి. మరి అందులో తీసేయాలని చిన్మయి ఎందుకు ప్రశ్నించలేదు? శివాజీ రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా చెప్పారు. ఎవరి సెన్స్ వాళ్లదే అవ్వచ్చు. మరి అనసూయ కొడుకుల పంచెకట్టు కార్యక్రమంలో చీర ఎందుకు కట్టుకుంది. ఎందుకంటే వారికి సంప్రదాయం తెలుసుకు కాబట్టి.

కానీ, సంప్రదాయాలు, కట్టు బొట్టు వాళ్లకు అవసరమైనప్పుడు వాడుకుంటారు. మీరు ఇండస్ట్రీలో ఎదిగారు. ఎదిగినప్పుడు మనమంటూ ఒక రోల్ మోడల్ గా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే అర్ధనగ్న ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. చీరలు కట్టుకుని వెళ్లవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లదే కావచ్చు. ఆ చీరలు అందంగా చూపించొచ్చు. నిధి అగర్వాల్ ఉల్లిపొరలాంటి బట్టలు ధరించి వెళ్లడం వల్లే కుర్రాళ్లు తాకాలని చూశారు. ఈ పోస్ట్ పెడితే.. ఆమె డ్రెస్ బాలేదని చాలామంది అన్నారు. అమ్మాయిల తీరు మారింది. చేయకూడని పనులన్నీ చేస్తున్నారు’’ అని చెప్పి చిక్కుల్లో పడింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ.. కరాటే కళ్యాణిని తిడుతున్నారు.

Next Story