- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల కానున్న సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు, టీజర్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘పల్లి పల్లి బెల్లంపల్లి’ అనే మూడో సాంగ్‌ను నటుడు శివరాజ్ కుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ఈ సినిమా డైరెక్టర్ చంద్రు అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు.
ఇందులో నేను భాగమవడం ఆనందంగా ఉంది. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నాడు. అలాగే హెల్త్ మినిస్టర్ కె. సుధాకర్, ఉపేంద్ర మాట్లాడుతూ.. సినిమా పాటలే కాదు థియేటర్ లో మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు హ్యాపీ గా ఫీల్ అవుతారన్నారు. చివరగా మూవీటీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన దర్శకుడు.. ఇండియా లెవల్లో 1800 థియేటర్స్‌లో విడుదల చేస్తున్న చిత్రాన్ని ఘనవిజయం చేయాలని కోరారు.






