తన మూవీ స్టైల్ మార్చిన శేఖర్ కమ్ముల.. అలవాటు లేని పనులు చేయబోతున్నాడా..!

by Dishafeatures1 |
తన మూవీ స్టైల్ మార్చిన శేఖర్ కమ్ముల.. అలవాటు లేని పనులు చేయబోతున్నాడా..!
X

దిశ, సినిమా: శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే స్వీట్ అండ్ షాట్ గా ఉంటాయి. ఎలాంటి విలన్ లోబీజి ఏం లు లేకుండా కూల్ గా ఉంటాయి. ‘ఆనంద్’ ‘గోదావరి’ వంటి ఎవర్ గ్రీన్ మూవీస్ తన ఖాతాలో ఉన్నాయి. అలా ఇప్పటివరకు శేఖర్ కమ్ముల కమర్షియల్ హంగుల జోలికి పోకుండా.. తనదైన శైలిలో నాచురాలిటీ కి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మొదటిసారి తన తీరును మార్చుకోబోతున్నాడట శేఖర్ కమ్ముల.

ప్రజంట్ ఈ దర్శకుడు ధనుష్ తో ‘దారావి’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అలవాటు లేని పనులన్నీ చేయడానికి రెడీ అవుతున్నాడు శేఖర్ కమ్ముల. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఉండవు. కానీ ఈ ధనుష్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాత్రం సాలిడ్ ఫైట్ సీన్స్ ఉంటాయట. ముంబైలోని ప్రధానమైన మురికివాడ.. మాఫియాకు లింక్ చేస్తూ శేఖర్ కమ్ముల ఈ కథను రాసుకున్నాడట. మరి ఈ దర్శకుడి మార్పు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.




Next Story