అతన్ని చిన్నపిల్లాడిలా చూస్తే కోపం వస్తుంది: Shefali Jariwal

by Chukka Sudharani |   (  Updated:2022-10-23 12:23:55  IST  )

Bigg Boss 16: Kaanta Laga fame Shefali Jariwala says she feels 'angry' when Abdu Rozik is treated like a child

అతన్ని చిన్నపిల్లాడిలా చూస్తే కోపం వస్తుంది: Shefali Jariwal
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా.. హాస్య నటుడు అబ్దు రోజిక్‌ను చిన్నపిల్లాడిలా చూస్తే తనకు కోపం వస్తుందంటోంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ 16' షో కంటెస్టెంట్లలో రోజిక్ తన ఫేవరేట్ అని చెప్పిన నటి.. రియాలిటీ షోలో సరైన గేమ్ ఆడుతున్న ఏకైక వ్యక్తి అతనేనని పొగిడేసింది. ఇక మిగతావాళ్లందరూ కేవలం ఏడుస్తూ, ఏదో రకమైన పోరాటం చేస్తున్నట్లు హంగమా చేస్తున్నారన్న ఆమె.. 'నేను కొన్ని ఎపిసోడ్స్ చూశాను. అబ్దు నిజంగా తెలివైనవాడని అనుకుంటున్నా. అతనిలో నాకు బాగా నచ్చినది ఏమిటంటే.. భాష తెలియకపోయినా ఆ ఇంట్లో జరిగే ప్రతిదానిలో చురుకుగా పాల్గొంటున్నాడు. అందుకు అతనికి హ్యాట్సాఫ్! అతడే నాకు ఇష్టమైన పోటీదారుడు' అంటూ ప్రశంసలు కురిపించింది. అలాగే అతన్ని కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం, చిన్నపిల్లాడిలా చూసుకోవడం నచ్చలేదన్న నటి.. అతని లోపాన్ని ఎత్తి చూపకుండా ఒక పెద్ద మనిషిగానే చూడమని అందరికీ చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : మళ్లీ ఒక్కటైన మాజీ ప్రియులు.. ఫొటోలు వైరల్

Next Story