ఆమె కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తుంది - రాజ్ తరుణ్-అరియానా రిలేషన్‌పై ఆర్జే శేఖర్ భాషా సంచలన కామెంట్స్

by Kavitha |
ఆమె కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తుంది - రాజ్ తరుణ్-అరియానా రిలేషన్‌పై ఆర్జే శేఖర్ భాషా సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత ‘ఈడోరకం ఆడోరకం’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘కుమారి 21 ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామా’, ‘లవర్’, ‘తిరగబడరా సామి’, ‘పురుషోత్తముడు’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ, గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

లావణ్య అనే అమ్మాయి.. రాజ్ తరుణ్‌ను ప్రేమించి మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మధ్యలో ఆర్జే శేఖర్ భాషా రావడంతో ఈ కేసు.. రాజ్ తరుణ్‌కు ఫేవర్‌గా తిరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ భాషా.. లావణ్య గురించి, రాజ్ తరుణ్ - అరియానా రిలేషన్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు.

శేఖర్ భాషా మాట్లాడుతూ.. ‘‘రాజ్ తరుణ్ కేసులో నేను జోక్యం చేసుకున్నందుకు నన్ను తిట్టినా పర్లేదు. ఈ క్రమంలో వీళ్లు చాలామంది అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడారు. అయినా ఇంకా అరియానా ఎందుకు స్పందించలేదంటే.. అందరూ రోడ్డున పడి అయ్యో అనుకోరు. కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు తను కూడా బయటకు వస్తుంది. పరువు నష్టం దావా వేస్తారు. డిపార్ట్మెంట్‌లో ఒక సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, సెక్షన్లు ఎలా వాడుకోవాలి అని లావణ్యకు బాగా తెలుసు. కానీ అరియానాకు ఇదంతా అలవాటు లేదు. కేసులు పెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవడం ఆ అమ్మాయికి ఇంకా తెలియదు. అరియానా ముందుకు వచ్చి కేసు పెడితే అంతా దద్దరిల్లిపోతోంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు శేఖర్ భాషా. అలాగే లావణ్య దగ్గర ఏ ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మాట్లాడడం కూడా పెద్ద విషయం కాదు.. కానీ ఇది ప్రసారం చేస్తే ఒక అమ్మాయికి భారీగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మీడియా ఎలా వేస్తారు’’ అని మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు శేఖర్ భాషా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

Divvela Madhuri:‘నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకోగా..నేను చేసుకుంటే తప్పేంటి?’.. దివ్వెల మాధురి షాకింగ్ కామెంట...

Advertisement

Next Story