‘మిరాయ్’ విషయంలో ఆమె ఎక్కువ గర్వంగా ఫీల్ అయింది.. మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-13 11:27:44  IST  )

బాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’.

‘మిరాయ్’ విషయంలో ఆమె ఎక్కువ గర్వంగా ఫీల్ అయింది.. మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మంచు మనోజ్(manchu manoj), శ్రియా సరణ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ‘మిరాయ్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఇందులో మంచు మనోజ్ మహావీర్ లామా పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈక్రమంలో.. తాజాగా, మనోజ్ తన తల్లితో సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘మిరాయ్ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కువ గర్వంగా ఫీల్ అయింది.

దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదరపూర్వక ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు. అలాగే తల్లి ఆశీర్వాదం తీసుకున్న వీడియోను షేర్ చేశాడు. కాగా.. గత కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే మనోజ్ అందరికీ దూరంగా తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. చాలా రోజుల తర్వాత తన తల్లి ‘మిరాయ్’ విజయం తర్వాత కలిసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మళ్లీ కలిసిపోవాలని కామెంట్లు చేస్తున్నారు.

link

Next Story