శర్వానంద్ ‘బైకర్’ సినిమా వాయిదా.. కీలక నోట్ విడుదల చేసిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైకర్’(Biker).

శర్వానంద్ ‘బైకర్’ సినిమా వాయిదా.. కీలక నోట్ విడుదల చేసిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైకర్’(Biker). ఈ సినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన శర్వానంద్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందిస్తూ కీలక నోట్ విడుదల చేశారు. ‘‘బైకర్.. స్క్రీన్లకు మించిన అనుభవం.. ఈ బీస్ట్‌ను తయారు చేయడానికి మా నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎన్నో రాత్రులు కష్టపడ్డాం.. కష్టపడుతున్నాం. మమ్మల్ని నమ్మండి.. మేము ఇప్పటివరకు చూపించిన దానికంటే ఈ సినిమా ఎన్నో రేట్లు మెరుగ్గా ఉంటుంది.

ఇది కేవలం చిత్రం కాదు.. మునుపెన్నడూ చూడని ఒక గొప్ప అనుభవం. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ కి, ఇలాంటి స్కేల్‌కి.. మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేయడానికి, మీలో అడ్రినలిన్ పరుగెత్తేలా చేయడానికి, మీ గుండెలు వేగంగా కొట్టుకునేలా చేయాలన్నదే మా ప్రయత్నం. ‘బైకర్’ వాయిదా వేస్తున్నాం.. ఓ సినిమాగానే కాదు గతంలో ఎప్పుడూ చూడని ఓ అనుభవాన్ని ఇవ్వబోతున్నాం. ‘బైకర్’ థియేటర్లలో 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్లలో రానుంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శర్వానంద్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

కాగా..అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో.. మూడు తరాల కుటుంబ కథగా రాబోతున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. శర్వానంద్ మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘బైకర్’తో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే బైక్ రేసర్‌గా శర్వానంద్‌ను చూసేందుకు అతృతగా ఉన్నారు.

link

Next Story