Sharwanand: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో శర్వానంద్‌

by Disha Web Desk 10 |
Sharwanand: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో శర్వానంద్‌
X

దిశ, వెబ్ డెస్క్ : కొద్దీ రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న హీరో శర్వానంద్‌కి నిన్న అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన వెళ్తున్న రేంజ్ రోవర్ కారు.. ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి.. బోల్తా పడింది. దాని వల్ల శర్వానంద్‌కి చిన్న గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు శర్వానంద్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం శర్వానంద్‌ పరిస్థితి బాగానే ఉందనీ.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పెళ్లి సమయంలో ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more:

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అఖిల్‌తో కాదు.. ఆ హీరోతోనే..? రేపే అనౌన్స్‌మెంట్ (వీడియో)


Next Story