యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన శార్వరి వాఘ్.. యంగ్ హీరోతో రొమాన్స్‌కు రెడీ!

by Mallepaka Hamsa |

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 79వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమాలో శార్వరి హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు సమాచారం.

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన శార్వరి వాఘ్.. యంగ్ హీరోతో రొమాన్స్‌కు రెడీ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తాజాగా, యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) బ్యానర్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ‘సైయారా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అహాన్ పాండే సరసన శార్వరి జోడీగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 79వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచే ప్రారంభమైందని తెలుస్తోంది. అహాన్ పాండే, శార్వరి వాఘ్ లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, శార్వరి వాఘ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘అల్ఫా’ విడుదలకు సిద్ధమవుతోంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, శార్వరి మరో కీలక పాత్రలో నటిస్తోంది. శివ్ రావైల్ దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి హేమాహేమీలు నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గ్లామర్‌తో పాటు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ‘అల్ఫా’ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇలా ఒకేసారి భారీ బడ్జెట్ సినిమాల్లో భాగమవుతూ, యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి పెద్ద బ్యానర్లలో వరుస అవకాశాలు అందుకుంటూ శార్వరి తన కెరీర్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తోంది. ఆలియాతో స్పై ఆపరేషన్, అహాన్ పాండేతో రొమాన్స్.. ఇలా శార్వరి వాఘ్ రూట్ చూస్తుంటే బాలీవుడ్‌లో ఈమె హవా గట్టిగానే నడిచేలా కనిపిస్తోంది.

Next Story