- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ జశ్వంత్.. దేవుడు నిర్ణయించిన బంధం అంటూ పోస్ట్
సెన్సేషనల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జశ్వంత్(Shanmukh Jaswanth)కు పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: సెన్సేషనల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జశ్వంత్(Shanmukh Jaswanth)కు పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు కరవ్ సాంగ్స్‌లో కనిపించ ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు వచ్చింది. ఈక్రమంలోనే.. రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం లభించింది. ఇక ఇందులో పాల్గొన్న షణ్ముఖ్.. టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలో దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నట్లు రివీల్ చేశాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలోనూ సిరి హన్మంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ ఏర్పడటంతో.. ఇంటి నుంచి బయటకు వచ్చాక తన ప్రేయసితో బ్రేకప్ అయిపోయింది. ఈ విషయం అప్పట్లోపెద్ద సెన్సేషన్‌గా మారింది.
అంతేకాకుండా అనేవ వివాదాలు షణ్ముఖ్ చుట్టుముట్టాయి. అతనిపై ఏకంగా డ్రగ్స్ ఆరోపణలు రావడంతో.. పాటు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ వివాదాలు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కొద్ది రోజులపాటు అన్నింటికి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉన్నాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే ఫామ్‌లో వస్తున్నాడు. మళ్లీ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, కొత్త సంవత్సరం షణ్ముఖ్ గుడ్ న్యూస్ చెప్పాడు. నేడు తన ప్రియురాలిని పరిచయం చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు కానీ ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమెకు పుట్టినరోజు విషెస్ చెప్తూ.. దేవుడు నిర్ణయించిన బంధం అని క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా V అంటూ ప్రియురాలిని సంభోధించడంతో.. ఆమె పేరు వి అక్షరంతో మొదలవుతుందని అర్థమవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అన్నా ఫైనల్లీ రెండో ప్రయాణం మొదలెట్టావు.. ఏంటి ఈ సర్‌ప్రైజ్ ఊహించలేదు.. కంగ్రాట్స్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.






