హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన Shanmukh Jaswanth.. అసలు ఏం జరిగిందంటే?

by Dishanational2 |
హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన Shanmukh Jaswanth.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్‌లో సూర్య, సాఫ్ట్ వేర్ డెవలపర్ సీరిస్‌ల తో ఎంతగానో ఆకట్టుకుని, సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కనిపించి రెండింతల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ క్రమంలో షన్నుకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తగినట్లే ఆయన పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అభిమానులను మరింత కంగారు పెడుతోంది. అయితే ఆ తర్వాత 'ఐ యామ్ ఫైన్' అంటూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 'అరె ఏంట్రా ఇది నీ బర్త్‌ డేకు ముందు ఇలా జరిగింది. దిష్టి తగిలినట్టుంది' అని కామెంట్ చేస్తున్న ఫ్యాన్స్.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed