ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. చాలా నేర్చుకున్నానంటూ షానయా కపూర్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-29 13:35:45  IST  )

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షానయా కపూర్(Shanaya Kapoor) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. చాలా నేర్చుకున్నానంటూ షానయా కపూర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షానయా కపూర్(Shanaya Kapoor) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు, హిందీ సినిమాల్లో నటించి ఈ బ్యూటీ అనుకున్నంత ఫేమ్ రాబట్టుకోలేనప్పటికీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం వరుస మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ, బిజీగా ఉంది. ఈ అమ్మడు విక్రాంత్ మస్సే(Vikrant Massey) సరసన ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’(Aankhon Ki Gustaakhiyan) సినిమాలో నటిస్తోంది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షానయా కపూర్ తన సినీ కెరీర్‌లో జరిగిన విషయాలను తెలుపుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

‘‘ఇప్పటివరకు నా ప్రయాణం నాకు చాలా విషయాలను నేర్చిందని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీ కీర్తి, ఒత్తిడి అన్నింటినీ ఇచ్చింది. కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. అయినప్పటికీ అన్నింటినీ సానుకూలంగా తీసుకున్నాను. కొంతమంది అభిప్రాయాల వల్ల అలా ఉండకూడదని నాలో చాలా మార్చుకున్నాను. నేను ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మాత్రం నా తల్లిదండ్రులు. వారు నన్ను ఒక నిర్దిష్ట మార్గంలో పెంచారు. నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. నా జీవితంలో ఏది జరిగినా ఏదో ఒక కారణం వల్లే జరుతుందని అనుకుంటాను. ప్రతిదీ ఏదో గొప్పగా జరగడానికి నేను దేవతను కాదు.. కాబట్టి అది ఉండాల్సిన విధంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story