- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ స్టార్‌తో షనయా కపూర్ రొమాన్స్.. జాంబీ కామెడీతో సరికొత్త ప్రయోగం!
ఇప్పటికే తన గ్లామర్ అండ్ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న షనాయా, ఈ సినిమాతో ఒక కొత్త జోనర్‌ను టచ్ చేయబోతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ సెన్సేషన్ షనాయా కపూర్ దూకుడు పెంచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ క్రేజీ హారర్ థ్రిల్లర్-కామెడీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే తన గ్లామర్ అండ్ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న షనాయా, ఈ సినిమాతో ఒక కొత్త జోనర్‌ను టచ్ చేయబోతోంది. కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో షనాయా ప్రత్యేకత చూపుతోంది. ఆమె చేస్తున్న సినిమాలు చూస్తుంటే, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటోందని అర్థమవుతోంది. ఇందులో టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ స్టార్‌తో కలిసి, బాలీవుడ్‌లో చాలా అరుదుగా వచ్చే హారర్ థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న మూవీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘గో గోవా గాన్’ (2013) తర్వాత సరైన జోమ్-కామ్ చిత్రం రాలేదు.
అటువంటి విభిన్నమైన జోనర్‌లో ఒక స్టార్ హీరోతో కలిసి షనాయా నటిస్తుండటం ఆమె క్రేజ్‌ను మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు. టైగర్ ష్రాఫ్ ఇప్పటివరకు కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం కాగా, ఇందులో ఆయన కామెడీ యాంగిల్‌ను కూడా బయటకు తీసుకురావడంలో షనాయా పాత్ర కీలకం కానుందట. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై కొత్తగా ఉండటమే కాకుండా, కామెడీ పరంగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు షనాయా తన ఇతర కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయనున్నట్లు టాక్. టైగర్ ష్రాఫ్ యాక్షన్ స్టైల్, షనాయా కపూర్ ఫ్రెష్ లుక్స్, కామెడీ టైమింగ్ తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న ఈ భామ, రాబోయే రోజుల్లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.






