పాపం.. ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. అక్కడ కూడా రామ్ చరణే టాప్?

by Dishanational2 |
పాపం.. ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. అక్కడ కూడా రామ్ చరణే టాప్?
X

దిశ, వెబ్‌డెస్క్ : త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో త్రిబుల్ ఆర్ చిత్రానికి అందరూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వైపు సంతోషంతో అందరూ సంబరాలు చేసుకుంటే, మరోవైపు మాహీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఐఎండీబీ ర్యాంకింగ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి గురి అయ్యేలా చేసింది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన టాప్ 30 ఇండియన్ సెలెబ్రిటీల లిస్ట్ లో రామ్ చరణ్ మూడవ స్థానం ద‌క్కించుకోగా, జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 16 వ స్థానం దక్కింది. త్రిబుల్ ఆర్ సినిమా రామ్ చరణ్‌కు మంచి క్రేజీ తీసుకొచ్చింది. ఆయన హాలీవుడ్‌కు వరస ఇంటర్వ్యూలు ఇవ్వడం,అవతార్ చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఇలా చాలా అంశాలు రామ్ చరణ్‌ను ఐఎండీ ర్యాకింగ్‌లో టాప్ 3లో ఉండేలా చేశాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఐఎండీ ర్యాంకింగ్‌లో మా హీరో ఎన్నో స్థానంలో ఉన్నా.. మా అన్నే బెటర్ అంటూ పోస్టులతో ముంచెత్తుతున్నారు.

Also Read: దానయ్యను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పట్టించుకోవట్లేదా?

Next Story

Most Viewed