- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగలగొడతా: షాలిన్‌పై టీనా ఫైర్
'బిగ్ బాస్ 16' కంటెస్టెంట్స్ టీనా దత్తా, షాలిన్ భానోత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

X
దిశ, సినిమా: 'బిగ్ బాస్ 16' కంటెస్టెంట్స్ టీనా దత్తా, షాలిన్ భానోత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రీసెంట్ ఎపిసోడ్‌లో భాగంగా ఒకరినొకరు దూషించుకుంటూ దారుణంగా అవమానపరుచుకున్నారు. ఈ మేరకు ముందుగా టీనా క్యారెక్టర్ గురించి మాట్లాడిన షాలిన్.. ఆమెను 'డోగ్లా(Two Faced)' అని విమర్శించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీనా అతన్ని ''గందా ఆద్మీ' నీ చెంపపగలకొడతా' అని ఫైర్ అయింది.
అంతటితో ఆగకుండా షాలిన్ అందరూ అనుకున్నట్లు మంచివాడు కాదని, మాజీ భార్య ముందు గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడంటూ పరువుతీసింది. ఇక వెంటనే స్పందించిన షాలిన్.. 'నీలో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి నీ నుంచి దూరంగా వెళ్లగానే నెగెటివ్ కామెంట్ చేస్తావ్. ఎవరూ ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించొద్దు' అంటూ కోపంతో ఊగిపోయాడు.
Next Story






