మహిళలపై శక్తిమాన్ కామెంట్స్.. సెక్స్‌కు ఆహ్వానిస్తున్నారంటే..

by Disha Web Desk 7 |
మహిళలపై శక్తిమాన్ కామెంట్స్.. సెక్స్‌కు ఆహ్వానిస్తున్నారంటే..
X

దిశ, సినిమా : ముఖేష్ ఖన్నా అంటే ఎవరో మనకు గుర్తుకు రాకపోవచ్చు కానీ 'శక్తిమాన్' అని చెప్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తాం. బుల్లితెరపై మొదటి సూపర్ మ్యాన్‌గా 90's కిడ్స్‌కు సుపరిచితుడైన ముఖేష్.. తాజాగా మహిళల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా శృంగారంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నారన్న నటుడు.. నిజానిజాలు తెలుసుకోకుండా ఆకర్షితులవుతున్న అమాయక పురుషులు ఆ తర్వాత మోసపోతున్నారని తెలిపాడు. 'దయచేసి ఇలాంటి మెసేజెస్ వాట్సాప్, సోషల్ మీడియాలో ద్వారా వస్తే వాటిని నమ్మి మోసపోకండి. ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని సెక్స్ కావాలని అడిగితే.. డెఫినెట్‌గా ఆమె అమ్మాయి కాదు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తుందని అర్థం. ఎందుకంటే మన నాగరికత ఇంకా అంతలా దిగజారలేదు. సాధారణంగా మంచి లక్షణాలున్న అమ్మాయిలు ఇలాంటి విషయాలను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేరు. అలా మాట్లాడితే సమాజం నశించినట్లే' అంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడు తండ్రేనా.. ఆ సమయంలో కూతురిపై అత్యాచారం.. విస్తుపోయే విషయాలు చెప్పిన బాలిక


Next Story

Most Viewed