- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షకీలా డ్రైవింగ్ స్కూల్‌లో సెక్స్ పాఠాలు.. వీడియో వైరల్
ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘షకీలాస్ డ్రైవింగ్ స్కూల్’ స్ట్రీమ్ అవుతోంది.

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘షకీలాస్ డ్రైవింగ్ స్కూల్’ స్ట్రీమ్ అవుతోంది. ‘సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4’లో భాగంగా ఈ సెషన్ స్టార్ట్ కాగా.. నోట్‌బుక్స్ ఓపెన్ చేసి పాయింట్స్ నోట్ చేసుకోమని చెప్తున్నారు మేకర్స్. ఇక కంటెంట్ విషయానికి వస్తే.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు డ్రైవింగ్ నేర్చుకునేందుకు షకీలా దగ్గరకు వస్తారు. ఈ క్రమంలో క్లచ్, గేర్ గురించి వారికి వివరిస్తూనే.. సేఫ్ సెక్స్, ఓరల్ సెక్స్, ఫోర్ ప్లే గురించి ఆడియన్స్‌కు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. పోర్న్ గురించి చెప్పిన షకీలా.. ఇది రియల్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉండదని, శృంగారం విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా పార్ట్‌నర్ ఇష్టాయిష్టాల గురించి కూడా తెలుసుకోవాలని సూచించింది. జెండర్ ఐడెంటిటీ, సెక్సువల్ ఓరియంటేషన్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలని.. హస్తప్రయోగం సెల్ఫ్ హ్యాపీనెస్ ఇస్తుందని, ఇది హెల్తీ కూడా అని తెలిపింది.






