Shaitan : ‘సైతాన్’ తెలుగు వెబ్‌సిరీస్ OTT రిలీజ్‌ డేట్ ఫిక్స్

by Disha Web Desk 10 |
Shaitan : ‘సైతాన్’ తెలుగు వెబ్‌సిరీస్ OTT రిలీజ్‌ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’. రీసెంట్‌గా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సిరీస్‌తో హిట్ అందుకున్న డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ్‌ ఈ సారి క్రైమ్ థ్రిల్లర్ క‌థాంశం ‘సైతాన్’తో వస్తున్నాడు. ఇందులో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే సామాజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుందట. ఇక జూన్ 15న ఈ సిరీస్ డిస్నీ ప్లస్.. హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రదారులు ఓ పోలీస్‌ను మ‌ర్డర్ చేస్తూ క‌నిపిస్తున్నారు.

Read More... 'జపాన్' చివరి షెడ్యూల్ ఆరంభం అప్పుడే..?

చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్

Next Story