- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుచ్చిబాబు మాములోడు కాదు..ఏకంగా బాలీవుడ్ కింగ్ తోనే !
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం దర్శకుడు బుచ్చిబాబుకు వచ్చిందట

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కొత్త దర్శకుడు బుచ్చిబాబు గురించి తెలియని వారు ఉండరు. ఉప్పెన సినిమాతో 2021 లోనే సినిమా తీసి బంపర్ హిట్ అందుకున్నారు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశారు. అయితే అలాంటి బుచ్చిబాబుకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం దర్శకుడు బుచ్చిబాబుకు వచ్చిందట. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది.
దీంతో బుచ్చి బాబుకు బంపర్ ఆఫర్ తగిలినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రాంచరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమా 2026 మార్చిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే, బుచ్చిబాబు తలరాత మారనుందట. షారూఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోబోతున్నాడట.
ఈ దిశగా మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు. దీంతో పెద్ది సినిమా బంపర్ హిట్ అవుతుందని అంటున్నారు. అదే జరిగితే, బుచ్చిబాబు నక్కతోక తొక్కినట్లే అని అంటున్నారు.






