అక్కడ ముద్దు కావాలని అడిగిన అమ్మాయి.. షాకింగ్ రిప్లై ఇచ్చిన షారుఖ్

by Disha Web Desk 9 |
అక్కడ ముద్దు కావాలని అడిగిన అమ్మాయి.. షాకింగ్ రిప్లై ఇచ్చిన షారుఖ్
X

దిశ, సినిమా: ‘జవాన్‌’ ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న షారుఖ్ ఖాన్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా తెగ అలరిస్తున్నాడు. రెగ్యూలర్‌గా ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహిస్తూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌పై స్పందించాడు. ఈ మేరకు ప్రస్తుతం ‘Dunki’ షూటింగ్‌లో బిజీగా ఉన్న షారుఖ్‌ విరామంలో సరదాగా ఫ్యాన్స్‌తో చాటింగ్ మొదలుపెట్టగా.. ‘మీ చొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’ అని ఓ అమ్మాయి అడిగింది. దీంతో ‘కుడివైపుదా? ఎడమవైపుదా? అంటూ కొంటెగా ఆన్సర్ చేశాడు. అలాగే ‘Dunki’ సినిమా గురించి అడగగా.. ‘ఇది నాకు స్పెషల్ మూవీ. రాజ్‌కుమార్‌ ఇరానీసార్‌ కథల్లో ఎమోషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే సినిమా. కొన్ని మూవీస్ చేస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. నా డ్రీమ్ ప్రాజెక్టులలో ‘Dunki’ ఒకటి’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed