మీ ఆప్యాయత నాకు అత్యంత విలువైనది.. దయచేసి నన్ను క్షమించండి అంటూ షారుఖ్ పోస్ట్

by Mallepaka Hamsa |

తమ అభిమాన హీరోల పుట్టినరోజులు అనగానే అభిమానులంతా ఆ హీరో ఇంటి పరిసర ప్రాంతాలకు వెళ్లి నానా హంగామా చేస్తుంటారు.

మీ ఆప్యాయత నాకు అత్యంత విలువైనది.. దయచేసి నన్ను క్షమించండి అంటూ షారుఖ్ పోస్ట్
X

దిశ, సినిమా: తమ అభిమాన హీరోల పుట్టినరోజులు అనగానే అభిమానులంతా ఆ హీరో ఇంటి పరిసర ప్రాంతాలకు వెళ్లి నానా హంగామా చేస్తుంటారు. రాత్రి 12 గంటలకు గేట్ వద్దనే కేక్ కటింగ్స్ చేస్తూ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది బయటకు వచ్చి మరీ అభిమానులను సంతోష పరుస్తారు. కానీ కొందరు మాత్రం అలా చేయకుండా ఇంటి వద్దకు కూడా రావద్దని ముందే ప్రకటన విడుదల చేస్తుంటారు. తాజాగా, షారుఖ్ ఖాన్(Shahrukh Khan) పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. తమ అభిమాన హీరో బయటకు వచ్చి కలుస్తాడనుకుంటే.. షారుఖ్ మాత్రం వారిని పలకరించలేకపోయాడు. దానికి కారణం ఇటీవల ఆయనకు బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

భద్రత కోసమే రాలేకపోయాడు. ఈ విషయంపై అభిమానులకు క్షమాపణలు చెప్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా నిర్ణయం భద్రమే కోసమే. మీరంతా చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నాకు అత్యంత విలువైనది. మిమ్మల్ని చూడలేకపోయినా మీకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అతి త్వరలోనే మీ అందరినీ కలుసుకొని నా ప్రేమను తెలియజేయడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. దీంతో అభిమానులు కాస్త సంతోష పడుతున్నారు. ఇక గత కొద్ది రోజులుగా పలుచోట్ల తొక్కిసలాటలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. రిస్క్ ఎందుకని ఆలోచించి షారుఖ్ బయటకు రాలేదు. అలా చేయడమే మంచిది అయిందని అంతా అభిప్రాయపడుతున్నారు.

link

Next Story