Shah Rukh Khan: చికిత్స కోసం అమెరికాకు పయనం అయిన షారుఖ్‌ ఖాన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కంటి సమస్యకు చికిత్స తీసుకోవడం కోసం అమెరికా వెళ్లబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Shah Rukh Khan: చికిత్స కోసం అమెరికాకు పయనం అయిన షారుఖ్‌ ఖాన్.. ఆందోళనలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కంటి సమస్యకు చికిత్స తీసుకోవడం కోసం అమెరికా వెళ్లబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కంటి సమస్య బాగా బాధపెడుతుండటంతో ఇటీవల ముంబైలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నట్లు టాక్. దీంతో అక్కడి డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2014లో షారుఖ్ ఖాన్ కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నట్లు స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి కంటి సమస్య రావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఆయన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా, షారుఖ్ పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ కారణంగా సినిమాలను విరామం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వార్-2 లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. అప్డేట్స్ ఏమైనా వస్తాయని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు రావడంతో అందరూ అయోమయంలో పడిపోయారు.

Next Story