- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెట్స్‌లో తీవ్రంగా గాయపడిన షారుఖ్ ఖాన్..!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెట్స్‌లో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే షారుఖ్ తన ముక్కుకు బ్యాండేజీ తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెట్స్‌లో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే షారుఖ్ తన ముక్కుకు బ్యాండేజీ తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో అతను యునైటెడ్ స్టేట్స్లో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు సమాచారం. షూటింగ్ చేస్తుండగా షారుఖ్ ముక్కుకు బలంగా గాయం కావడంతో.. ముక్కు నుంచి రక్తం వచ్చింది. రక్తస్రావం ఆపడానికి షారుఖ్ ఖాన్ చిన్న శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు అతని బృందానికి తెలియజేశారు. దీంతో SRK శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి సినిమా బృందం స్పందిస్తే కానీ ఈ వార్త నిజమా కాదా తెలుస్తుంది.
Read More..
Next Story






