- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7 ఏళ్ల క్రితమే ‘మదరాసి’ కథను షారుఖ్‌కు చెప్తే పట్టించుకోలేదు.. మురుగదాస్ షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్(Murugadoss), శివ కార్తికేయన్(Siva Karthikeyan) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘మదరాసి’(Madharaasi).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్(Murugadoss), శివ కార్తికేయన్(Siva Karthikeyan) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘మదరాసి’(Madharaasi). సైలకాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో విద్యుత్ జమాల్, బీజు మీనన్, ఫబ్బీర్ విక్రాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏఆర్ మురుగదాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఏడేళ్ల క్రితమే ‘మదరాసి’ కథను నేను షారుఖ్ ఖాన్‌కు చెప్పాను.
ఆయన ఈ లైన్ చాలా నచ్చిందని చెప్పారు. కాకపోతే అప్పటికే నేను పూర్తిగి స్క్రిప్ట్ రాయలేదు. అందుకే హీరో పాత్ర గురించి తక్కువగా చెప్పాను. రెండు వారాల తర్వాత ఆయనకు మెసేజ్ చేశాను. కథ నచ్చినప్పటికీ ఆయన అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత షారుఖ్‌ను అడగలేదు. అప్పుడే శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అతడికి తగినట్లుగానే స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఆ కథను ఆయనకు చెప్పాను.. నచ్చడంతో నటిస్టానని చెప్పాడు. దీంతో వెంటనే ‘మదరాసి’ షూటింగ్ మొదలు పెట్టాము. దాదాపు అయిపోవడానికి వచ్చింది. సెప్టెంబర్ 5న మీ ముందుకు రాబోతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






