‘జ్విగాటో’ షారుఖ్‌‌ను రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. కామన్ ఫేస్ అంటూ

by Disha Web Desk 6 |
‘జ్విగాటో’ షారుఖ్‌‌ను రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. కామన్ ఫేస్ అంటూ
X

దిశ, సినిమా: ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ తన రాబోయే చిత్రం ‘జ్విగాటో’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నందితా దాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కపిల్ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ చేయడానికి షారుఖ్ ఖాన్ అంగీకరించినా అతడిని తీసుకోలేనని నందిత చెప్పినపుడు ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే ఈ కథ కోసం ‘కామన్ ఫేస్’ అవసరమని భావించినట్లు నాతో చెప్పారు.

ఆ క్షణం ఆమె మాటలను పొగడ్తగా తీసుకోవాలో లేక అవమానంగా భావించాలో నాకు అర్థం కాలేదు. నా మొహం ఏ గుంపులోనైనా సరిపోతుందని చెప్పడం ఒక రకంగా హ్యాపీగానే ఫీల్ అయ్యా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాక్టరీలో ఫ్లోర్ ఇన్‌చార్జి పదవిని కోల్పోయిన ఓ వ్యక్తి.. ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఎలాంటి కష్టాలు పడ్డాడనేది ‘జ్విగాటో’ కథ. కాగా ఈ మూవీని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నందితా దాస్ ఇనిషియేటివ్స్‌పై సమీర్ నాయర్ నిర్మించారు.

Next Story

Most Viewed