రాజమౌళి టీమ్ ‘ఆస్కార్‌’ను కొనేసిందా? చర్చనీయాంశమైన సెలబ్రిటీ ట్వీట్..

by Disha Web Desk 23 |
రాజమౌళి టీమ్ ‘ఆస్కార్‌’ను కొనేసిందా? చర్చనీయాంశమైన సెలబ్రిటీ ట్వీట్..
X

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంపై ఓ బాలీవుడ్‌ సెలబ్రిటీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ఇండియాలో ఈజీగా అవార్డులు కొనుక్కోవచ్చనే విషయం తెలుసని, కానీ ఇప్పుడు ఆస్కార్‌ను కూడా కొనేస్తున్నారని కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లకు , మేకప్ ఆర్టిస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన షాన్ ముట్టతిల్.. ఫ్యాషన్ ఫీల్డ్‌లో భారీ క్రేజ్‌ సంపాదించాడు. ఇదే స్టేటస్‌తో ఫిల్మ్ మ్యాగజైన్స్‌పై మెరుస్తూ వైరల్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డులపై తన ఫీలింగ్ షేర్ చేస్తూ ‘నాటు నాటు’ను మెన్షన్‌ చేయకుండానే.. ‘ఇండియాలోనే ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నా. కానీ, ఆస్కార్‌ను కూడా కొనేస్తారా? డబ్బుంటే చాలు ఏదైనా దక్కించుకోవచ్చు’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ‘బాలీవుడ్‌కు మింగుడు పడట్లేదు. కుళ్లుతోనే ఇదంతా చేస్తున్నారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.



Next Story

Most Viewed