- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సె*క్స్ ఒక పవిత్రమైన కార్యం.. దాన్ని చెడుగా చూడటం మానుకోండి.. తమన్నా ఫైర్
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia ) తెలుగు, హిందీ, తమిళ వంటి భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia ) తెలుగు, హిందీ, తమిళ వంటి భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు సిరీస్, స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతోంది. ఇటీవల స్కిన్ షో పెంచేసి అందాలను ఆరబోస్తోంది. ఇక తమన్నా నటించిన ఓ సీన్ వివాదాస్పదమైంది. దీంతో నెటిజన్లు ఆమెపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ అమ్మడు నటించిన ‘బాహుబలి’ మూవీలో పచ్చబొట్టేసినా సాంగ్‌లో సె*క్స్ సీన్ చేయడంపై నెటిజన్లు దారుణంగా మాట్లాడుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ ఈ విషయంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘అవంతిక ఒక దేవత లాంటి అమ్మాయి. స్త్రీ తత్వంతో నిండిన, ప్రేమించాలనుకునే ఒక అందమైన స్త్రీ. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల వల్ల దగ్గరకు ఎవరినీ రానివ్వదు. తన చుట్టూ తానే గోడలు కట్టుకుంటుంది. ఈ సమయంలోనే ఓ అబ్బాయి వచ్చి తన అందానికి ఆత్మవిశ్వాసం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు’’ అని రాజమౌళి అన్నాడు. దీంతో నేను ఈ సీన్‌లో లీనమై నటించాను. కానీ ఆ పాటపై పలు విమర్శలు వస్తున్నాయి. సె*క్స్ అనేది శుద్ధమైన, పవిత్రమైన కార్యం. కానీ కొందరు దాన్ని చెడుగా చూస్తున్నారు.
అలా చేయడం మానుకోండి. అలాంటి సీన్స్‌లో చూసినప్పుడు ఛీ అంటున్నారు. అయినా అందులో ఛీ అనడానికి ఏముంది.. అది సృష్టి ధర్మం అని మర్చిపోయి నన్ను తప్పుగా చూస్తున్నారు. అయినా అది బహిరంగంగా మాట్లాడ లేనంత చెడు విషయం ఏం కాదు. ఒక చిత్ర నిర్మాత మీకు చాలా అందమైన దాన్ని చూపించాలనుకుంటున్నారు. కానీ మీరు వేరే దాన్ని చూస్తే, అది మీ ఆలోచన విధానాన్ని తెలుపుతోంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.






