- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 300 కోట్ల సినిమాకు సీక్వెల్ రెడీ.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

దిశ, సినిమా: గతేడాది ఓనం సీజన్‌లో ఒక చిన్న మెరుపులా వచ్చి, బాక్సాఫీస్ వద్ద పిడుగులా మారిన సినిమా ‘లోకా:చాప్టర్1’. మలయాళంలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ సినిమా ముగింపులోనే సీక్వెల్‌పై భారీ అంచనాలు పెంచిన దర్శకుడు డొమినిక్ అరుణ్, ఇప్పుడు చాప్టర్-2 కి రంగం సిద్ధం చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో కళ్యాణి (Kalyani Priyadarshan)మాట్లాడుతూ..‘లోక-2 (Lokah -2)కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. నేను కూడా ఈ పార్ట్‌లో నటిస్తున్నాను.. కాబట్టి మరిన్ని విశేషాల కోసం వేచి ఉండండి. త్వరలోనే అప్డేట్స్ ఇస్తాం’’ అంటూ కళ్యాణి క్లారిటీ ఇచ్చారు.
మొదటి భాగంలో ఆమె పోషించిన ‘నీలి’ పాత్ర, ఆధునిక ప్రపంచంలో ఒక సూపర్ పవర్‌గా మారి విలన్ నాచియప్పను ఎదుర్కోవడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. దర్శకుడు డొమినిక్ అరుణ్ జానపద కథలను ఫాంటసీతో కలిపి ఒక వెండితెర విజువల్ వండర్‌ను సృష్టించారు. రెండో భాగంలో కథ మరింత ఆసక్తికరంగా ఉండనుందని సమాచారం. ఇందులో టొవినో థామస్ 'మైఖేల్' (చాత్తాన్) పాత్రలో.. వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దుల్కర్ సల్మాన్, ‘చార్లీ’ (ఒడియన్) గా అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్. మలయాళంలోనే తొలి మహిళా సూపర్ హీరో చిత్రంగా గుర్తింపు పొందిన ఈ సినిమా సీక్వెల్ కోసం కేవలం మలయాళ ప్రేక్షకులే కాకుండా, పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుండటంతో, వచ్చే ఏడాది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి మంటలు రేపడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.






