- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyan Ram భార్య గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!
‘బింబిసార, అమిగోస్, ఓం త్రిడి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు కల్యాణ్ రామ్.

దిశ, వెబ్‌డెస్క్: ‘బింబిసార, అమిగోస్, ఓం త్రిడి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు కల్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ తర్వాత అత్యంత సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళ్లున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈయన భార్య గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కల్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం ఈయన భార్య స్వాతి అట. ఈమె డాక్టర్. అయినా వృత్తిపరంగా వెళ్లకుండా భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. ఈ హీరో నటించే ప్రతి మూవీ స్వాతి.. ఈమె బ్రదర్ కలిసే ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటారట. ఇక సినిమా ఒక్కసారి కనుక హిట్ కొడితే మరో 10 చిత్రాలు తీయవచ్చు. ఫ్లాప్ అయినా పెద్దగా ఇబ్బందేమి లేదు. ఎందుకంటే సొంత బ్యానర్‌లోనే మూవీస్ తీస్తున్నారు కాబట్టి. ఇక వీరి పిల్లలు పెద్దయ్యాక సొంతంగా విఎఫ్ సంస్థను ప్రారంభించే ఆలోచనలో కూడా ఉన్నారట. స్వాతి కల్యాణ్ రామ్ వ్యవహారాలే కాకుండా ఇతర బిజినెస్ పనులు కూడా చూసుకుంటుందట. కాగా నందమూరి కుటుంబానికి ఎంతో విలువనిస్తూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండే కల్యాణ్ రామ్ భార్య స్వాతిపై నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.






