హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-28 06:03:37  IST  )

కోలీవుడ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్(Abhishan Jeevinth) అందరికీ సుపరిచితమే. ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు.

హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ టీమ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్(Abhishan Jeevinth) అందరికీ సుపరిచితమే. ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అభిషన్ సెన్సేషన్ డైరెక్టర్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. అభిషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఆయన నటిస్తున్న మొదటి ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య నిర్మిస్తోంది. తన నిర్మాణ సంస్థ జియాన్ పిక్చర్స్, ఎం ఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మదన్(Madan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్(Anaswara Rajan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే ప్రియ రవి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, రాజ్ కమల్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఈ మూవీకి సీన్ రోల్డాన్ సంగీతం అందించబోతున్నాడు.

‘ప్రొడక్షన్-4’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఐశ్వర్య రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ టీమ్ అందరికీ స్వాగతం పలికింది. ‘‘ఇటీవలి సంవత్సరాలలో మలయాళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలను అందించిన అద్భుతమైన ప్రతిభావంతులైన నటి అనశ్వర రాజన్. మా నాల్గవ సినిమాలో మోనిషా పాత్రలో చేయబోతున్నారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. జియాన్ ఫిల్మ్స్, MRP ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ మా ప్రయాణంలో ఒక కొత్త మైలురాయిని సూచిస్తుంది. అనశ్వర రాజన్ ఈ సినిమాలో ఉండటం మాకు మరింత ఆనందంగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరిగినందుకు సంతోషంగా ఉందంటూ పలు ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అనశ్వర లక్కీ చాన్స్ కొట్టేసిందంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

link

Next Story