NTR విగ్రహంపై సంచలన వ్యాఖ్యలు.. కరాటే కల్యాణికి ‘మా’ అసోసియేషన్ షాక్

by Disha Web Desk 2 |
NTR విగ్రహంపై సంచలన వ్యాఖ్యలు.. కరాటే కల్యాణికి ‘మా’ అసోసియేషన్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై టాలీవుడ్ నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు యాదవ సంఘాలతో పాటు పలు హిందూ సంస్థలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో కలిసి కరాటే కల్యాణి కూడా తన వాయిస్ వినిపించింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, తాజాగా.. కరాటే కళ్యాణికి వాఖ్యలపై ‘మా’ అసోసియేషన్ స్పందించింది. మా అసోసియేషన్ నుంచి ఇప్పటికే ఆమెకు హెచ్చరికలు రాగా, తాజాగా.. మా జనరల్ సెక్రటరీ రఘుబాబు షోకాజు నోటీసులు జారీ చేశారు. కాగా, ‘ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నాకేం స‌మ‌స్య లేదు. కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నాను. ఆయన ఒరిజినల్ రూపంలో విగ్రహం ఏర్పాటు చేస్తే మంచిది’ అని కల్యాణి అన్నారు.


Also Read..

విరూపాక్ష సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన నటి ఎవరో తెలుసా?




Next Story

Most Viewed