- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramyakrishna: ‘డైరెక్టర్ అడిగితే మాత్రం వెంటనే ఓకే చెప్పేదాన్ని’.. సీనియర్ స్టార్ నటి ఆసక్తికర కామెంట్స్
అప్పట్లో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ(Ramyakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. లేడీ విలన్ పాత్ర(Lady villain role)లో నటించిన నరసింహ చిత్రం(Narasimha) ఈ నటికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. శక్తివంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మారింది. ఈ చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth)కు ప్రతినాయకురాలిగా నీలాంబరి(Nilambari) రోల్‌లో తన ప్రతిభ కనబర్చిన రమ్యకృష్ణపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర గురించి ఈ నటి ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నరసింహ(Narasimha)చిత్రంలో నీలాంబరి పాత్రలో నటించడం తనకు ఇష్టం లేదని వెల్లడించింది. ఎందుకంటే ఆ పాత్ర చేస్తే పొగరు ఉన్న నటిలా నటించాలని.. అది కేవలం పాత్రేనని తెలుసునని.. కానీ నాకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లుగా తీశారని వెల్లడించింది. ఒకవేళ డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ (K. S. Ravikumar) కనుక నన్ను.. సౌందర్య(Saundarya) లేదా నీలాంబరి రోల్.. ఏది కావాలి? అని అడిగితే తప్పకుండా ఏం ఆలోచించకుండా సౌందర్య పాత్రే కావాలని చెప్పేదాన్నని రమ్యకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.






