- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీరత్ కపూర్ మాస్ వార్నింగ్.. నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేయండి లేదంటే చర్యలు తప్పవు..!
షూటింగ్ ముగిసి నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటికీ ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ సెటిల్ చేయలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని, డబ్బులు అవసరమని వారికి మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్(Seerat Kapoor) తాజాగా తన రెమ్యునరేషన్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. రన్ రాజా రన్, రాజుగారి గది-2, టైగర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే, తాను నటించిన ఒక సినిమా షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా, ఇంకా తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వలేదంటూ సదరు నిర్మాణ సంస్థపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సీరత్ కపూర్ తన ఆవేదనను పంచుకుంటూ.. ‘‘షూటింగ్ ముగిసి నాలుగు నెలలు కావస్తోంది.
కానీ ఇప్పటికీ ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ సెటిల్ చేయలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని, డబ్బులు అవసరమని వారికి మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదు. ఇంతకాలం చాలా సహనంతో ఎదురుచూశాను, కానీ ఇప్పుడు నా ఓపిక నశించింది’’ అని పేర్కొన్నారు. కేవలం తనకే కాకుండా, తనతో పాటు పనిచేసే టీమ్ సభ్యులకు ఇవ్వాల్సిన పారితోషికం కూడా పెండింగ్‌లో ఉందని సీరత్ వెల్లడించారు. ‘‘నా టీమ్‌కి ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. కష్టపడి పనిచేసిన వారికి ఫలితం దక్కకపోవడం చాలా బాధాకరం. ఈ సమస్యను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలి.
లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అంటూ ఆ నిర్మాణ సంస్థకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సినిమా రంగంలో పైకి కనిపించే మెరుపుల వెనుక ఇలాంటి చేదు నిజాలు ఎన్నో ఉంటాయని సీరత్ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది. పెద్ద హీరోల చిత్రాలకైతే అంతా సవ్యంగా జరుగుతుంది కానీ, ఇలాంటి చిన్న లేదా మీడియం రేంజ్ సినిమాల హీరోయిన్లకు పేమెంట్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీరత్ ధైర్యంగా స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
లావణ్య త్రిపాఠికి ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మెగా కోడలు!






