- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లావణ్య త్రిపాఠికి ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మెగా కోడలు!
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనపై, మెగా కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న అకౌంట్లపై లావణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి, మెగా వారసుడు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తన పరువుకు భంగం కలిగించే వారిపై న్యాయ పోరాటానికి దిగారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనపై, మెగా కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న అకౌంట్లపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరంతరం వేధింపులకు గురిచేస్తూ, తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఖాతా ద్వారా గత కొంతకాలంగా లావణ్యను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నట్లు సమాచారం. తన క్యారెక్టర్‌ను కించపరచడమే కాకుండా, కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగడంపై లావణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం విమర్శలు చేయడం వేరు, కానీ అసభ్యతకు పాల్పడటం నేరమని భావించిన ఆమె, పోలీసుల ద్వారా నిందితులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67 (అశ్లీల సమాచారాన్ని ప్రసారం చేయడం) భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసులు నమోదు చేశారు. ఈ అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తులను ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ విభాగం నిమగ్నమైంది. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల మీద విమర్శలు చేయడం వేరు, కానీ వారి వ్యక్తిగత విషయాల గురించి అసభ్యంగా మాట్లాడటం నేరమని ఈ కేసు ద్వారా లావణ్య స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై విషం చిమ్మే వారికి ఈ కేసు ఒక హెచ్చరికగా మారుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






