కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన మీనాక్షి చౌదరి.. నీకు కావాల్సింది భర్త లేక పాలేరా అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |

కాబోయే భర్తకు 100 ఎకరాల ఆస్తితో పాటు ఇంటి పనులు, వంట పనులు చేసి పెట్టే లక్షణాలు ఉండాలి అంటుంది టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన మీనాక్షి చౌదరి.. నీకు కావాల్సింది భర్త లేక పాలేరా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా : ప్రజెంట్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ‘లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ అమ్మడు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పి వార్తల్లో నిలిచింది.

‘నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తికి వ్యవసాయం అంటే ఇష్టం ఉండాలి.. కనీసం 100 ఎకరాల భూమి ఉండాలి. అతనికి వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం కూడా తెలిసి ఉండాలి. అదనంగా, ఇంటి బాధ్యతలన్నీ అతనే చూసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. నీకు కావాల్సింది భర లేక పాలేరా అని, సరిపోతాయా ఇంకేమైనా కావాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. మీనాక్షి ప్రస్తుతం నాగచైతన్యతో పాటు నవీన్ పొలిశెట్టితో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ సరవేగంగా జరుగుతున్నాయి.

Next Story