‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:45:23  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక మీసాల పిల్ల సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. టాప్ ట్రెండింగ్‌లో కొనసాగడంతో.. అత్యధిక వ్యూస్ రాబడుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ శశిరేఖ సాంగ్ విడుదల చేశారు.

దీనిని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్ మధు ప్రియ పాడారు. కొద్ది సేపటి క్రితం విడుదలైన ఈ పాట వ్యూస్ రాబడుతున్నప్పటికీ నెటిజన్ల చేత విమర్శలు వస్తున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కొట్టి పారేస్తున్నారు. ఇక మొదటి సాంగ్ మెప్పించినంతగా.. సెకండ్ సింగిల్ వ్యూస్ రాబట్టుకునేలా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

Next Story