సత్యదేవ్-ఫరియా కాంబో ఫిక్స్.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న SD-15

by Mallepaka Hamsa |

హీరో సత్యదేవ్(Satyadev) తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.

సత్యదేవ్-ఫరియా కాంబో ఫిక్స్.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న SD-15
X

దిశ, సినిమా: హీరో సత్యదేవ్(Satyadev) తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ఆయన 15వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. SD-15 వర్కింగ్ టైటిల్‌తో త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్‌తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి (Lakshminarayana Puttanchetty)తెరకెక్కి్స్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) నాయికగా నటిస్తోంది. తాజాగా, హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేయగా.. లక్ష్మినారాయణ ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నా స్నేహితుడు ప్రొడ్యూసర్ నరేంద్ర మరో మంచి చిత్రాన్ని చేస్తున్నారు. హీరో సత్యదేవ్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత మళ్లీ మాట్లాడుతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు. డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ.. మా సినిమా జానర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. రామ్ మిరియాల అన్న మా సినిమాకు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ గారి కెరీర్ లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు.

Next Story