ఆ చానల్స్‌పై శరత్ బాబు ఫ్యామిలీ ఫైర్.. కేసు పెడతామంటూ వార్నింగ్..!

by Chukka Sudharani |   (  Updated:2023-05-05 09:16:04  IST  )

సీనియర్ నటుడు శరత్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఆ చానల్స్‌పై శరత్ బాబు ఫ్యామిలీ ఫైర్.. కేసు పెడతామంటూ వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే శరత్ బాబు రెండు రోజుల క్రితమే మరణించినట్లు పలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన శరత్ బాబు కుటుంబ సభ్యులు ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని తేల్చి చెప్పారు. ఐసీయూ నుంచి ఆయన్ని జనరల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని తెలిపారు.

అయినప్పటికీ శరత్ బాబు ఆరోగ్యం మీద వచ్చే వార్తలు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు మరోసారి ఆగ్రహించారు. శరత్ బాబు ఆరోగ్యం మీద వస్తున్న వీడియోలు యూట్యూబ్ చానల్స్ నుంచి తొలగించాలని కోరారు. లేని పక్షంలో వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా నిజానిజాలు తెలియకుండా ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు జరిపితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Also Read...

పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే.. జనసేన నుంచి పోటీ చేస్తా

Next Story