ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయిన శరత్ బాబు!

by Kodari Anjali |   (  Updated:2023-05-23 10:05:29  IST  )

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శరత్ బాబు 71ఏళ్లకు స్వర్గస్తులయ్యారు.

ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయిన శరత్ బాబు!
X

దిశ, సినిమా: విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శరత్ బాబు 71ఏళ్లకు స్వర్గస్తులయ్యారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. నటీనటులంతా వచ్చి నివాళులు అర్పించారు. రాలేనివారు సోషల్ మీడియా ద్వారా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. ఇకపోతే ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించినట్లు సమాచారం. ఎప్పటికైనా హార్సిలీ హిల్స్‌లో స్థిరపడాలని శరత్ బాబు చివరి కోరిక ఉండేదట. అక్కడ ఇంటి నిర్మాణం కూడా మొదలెట్టారట. కానీ, ఆ నిర్మాణం పూర్తి కాకుండానే ఆయన కన్నుమూయడం బాధరకరం అంటున్నారు ఫ్యాన్స్.

Read More: శరత్ బాబు మూడో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Next Story