- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > వాళ్లకు నచ్చిన యాంగిల్స్ చూపించేదాకా వదలరు.. వెంటపడి వేధిస్తారంటున్న సారా
వాళ్లకు నచ్చిన యాంగిల్స్ చూపించేదాకా వదలరు.. వెంటపడి వేధిస్తారంటున్న సారా
బీటౌన్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్ ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

X
దిశ, సినిమా: బీటౌన్ స్టార్ కిడ్, నటి సారా అలీఖాన్ ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రీసెంట్‌గా సరదాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన తనను వెంటపడి ఫొటోలు తీశారని.. సమయం, సందర్భం లేకుండా వెంటపడ్డారంటూ ఫైర్ అయింది. ఈ మేరకు రెస్టారెంట్ బయటకు రాగానే తన పేరు పలకొద్దని ఫొటోగ్రాఫర్లను కోరినట్లు చెప్పిన నటి.. తన పేరును పదే పదే ప్రస్తావిస్తూ చుట్టు పక్కనవాళ్లకు తెలిసేలా గోల చేస్తారని బాధపడింది. అంతేకాదు ఒకటిరెండు ఫొటోలతో సరిపోట్టుకోరన్న ఆమె.. వాళ్లకు కావాల్సిన యాంగిల్స్ అన్నీ పూర్తయ్యేదాకా వేచి ఉండమని, పోజులిమని కోరడం అస్సలు నచ్చలేదని చెప్పింది. ప్రస్తుతం రెస్టారెంట్ బయట తాను ఇబ్బంది పడ్డ వీడియో వైరల్ అవుతుండగా ఇందులో ‘అరవకండి. ఇది రెస్టారెంట్. అందరూ చూస్తున్నారు’ అంటూ సారా చెప్పడం గమనించవచ్చు.
Next Story






